వరంగల్ జిల్లా గిర్నిబావిలోని మహాత్మ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ బాయ్స్ గురుకుల పాఠశాలలో కొత్తగా 5వ తరగతిలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ మల్లయ్య మాట్లాడుతూ, కొత్తగా చేరిన విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఉపాధ్యాయులను తల్లిదండ్రులకు పరిచయం చేసి, విద్యార్థులకు అందించే నాణ్యమైన బోధన, వసతి, సంరక్షణ, క్రమశిక్షణ, విద్యా విధానం తదితర అంశాలను వివరించారు.