వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ రామానంద్ ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి ఆమె మాట్లాడుతూ, జననం నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజం, పోలియో రహిత దేశ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.