ఆర్టీసీ అందిస్తున్న టూర్ ప్యాకేజీలను పర్యాటకులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు. ఆర్టీసీ అందిస్తున్న టూర్ ప్యాకేజీల స్పెషల్ బస్సుల గోడ పత్రికలను గురువారం నర్సంపేటలో ఆవిష్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు దర్శనీయ, దేవాలయాలకు నర్సంపేట నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు.