ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పాకెట్లు పంచిన సర్పంచ్

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం, మర్రిపల్లి గ్రామంలో బుధవారం ఎండల తీవ్రత నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంట రాజుకుమార్, వార్డు సభ్యులు డ్యాగం రాణి, కుక్కమూడి కవిత, గాజు శివాజీ, ఆశా కార్యకర్త మైదం సరోజన, డ్యాగం శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్య వేడిమి నుండి కూలీలకు ఉపశమనం కలిగించింది.