వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్ చెడ గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి-సురేష్ ఉపాధి హామీ పథకం కింద ఇస్లావత్ స్వామి - మొట్ల కుంట వరకు గల కాలువలను ప్రారంభించారు. ఈ పథకం పేద ప్రజలకు పని దినాలు కల్పించి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తిప్పని చేరాలు, గ్రామ ఉప సర్పంచ్ కక్కేర్ల రజిత తదితరులు పాల్గొన్నారు.