గడ్డిలో పాము కాటు: సర్పంచ్ ఆరోగ్యంపై ఆందోళన

0చూసినవారు
గడ్డిలో పాము కాటు: సర్పంచ్ ఆరోగ్యంపై ఆందోళన
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ధర్మతండ గ్రామ సర్పంచ్ బోడ రవి నాయక్ నిన్న తన వ్యవసాయ క్షేత్రంలో గడ్డిలో చిత్తడిగా ఉన్న ప్రదేశం నుండి వెళ్తుండగా పాము కాటుకు గురయ్యారు. వెంటనే ఆయన ఊటూరు సివిల్ హాస్పిటల్ కు తరలించబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ట్రైబల్ వర్క్ జర్నలిస్టు అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు జాటోతు యాకుబ్ నాయక్ బుధవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రవి నాయక్ ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు.

సంబంధిత పోస్ట్