లక్నేపల్లి రైస్‌మిల్లుపై టాస్క్‌ఫోర్స్ దాడి: 18.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్

9చూసినవారు
లక్నేపల్లి రైస్‌మిల్లుపై టాస్క్‌ఫోర్స్ దాడి: 18.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్
వరంగల్ టాస్క్‌ఫోర్స్ బృందం నర్సంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్నేపల్లి రాజరాజేశ్వరి రైస్‌మిల్లుపై దాడి చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన 18.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్నిబుధవారం స్వాధీనం చేసుకుంది. సుమారు రూ.63 వేల విలువైన బియ్యంతో పాటు ఒక టాటా ఏస్ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఈ ఘటనలో నూనె రాకేష్, గుగులోత్ యాకూబ్‌లను అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యల కోసం నర్సంపేట పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్