తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో విఫలమైందని, దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న బంద్‌కు వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయలేదని, గత నెలలో విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఈ సమస్యపై మంగళవారం ఆయన ఈ ప్రకటన చేశారు.