రాష్ట్ర ప్రభుత్వం గొల్లకురుమలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పశుసంవర్ధక శాఖకు మంత్రిని కేటాయించాలని శనివారం గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో గొర్రెలు, మేకలు పెంపకందార్ల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.