ఆ ఇంట ముగ్గురు సర్పంచులు

3చూసినవారు
ఆ ఇంట ముగ్గురు సర్పంచులు
నర్సంపేట మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీ 1970లో ఏర్పడింది. ఈ ఏజెన్సీ గ్రామంలో ఇప్పటివరకు 8సార్లు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. విశేషమేమిటంటే, ఒకే ఇంటి నుంచి ముగ్గురు వ్యక్తులు సర్పంచులుగా సేవలందించారు. తల్లి, కొడుకు, కోడలు గ్రామ ప్రథమ పౌరులుగా పనిచేశారు. 2001లో బానోతు కోమటి (కోడలు) సర్పంచిగా ఎన్నికై 2006 వరకు కొనసాగారు. ఆ తర్వాత ఆమె అత్త బానోతు మల్లమ్మ 2006 నుంచి 2011 వరకు సర్పంచిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో బానోతు దస్రు (కొడుకు) గెలుపొంది 2024 వరకు సర్పంచిగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్