తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట నుండి శుక్రవారం సూపర్ లగ్జరీ బస్సు టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ బస్సు అన్నవరం, సింహాచలం, వైజాగ్, బుర్ర గుహలు, అరకు, సామర్లకోట, ద్రాక్షారామం, ద్వారకా తిరుమల, భద్రాచలం వంటి ప్రదేశాలలో దైవ దర్శనాలు చేసుకుని 31/03/2026 (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు నర్సంపేట చేరుకుంటుందని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి, సూపర్వైజర్లు, డిపో ఉద్యోగులు, పర్యాటకులు పాల్గొన్నారు.