కొమ్మాల జాతర సందర్భంగా వాహనాల దారి మళ్లింపు

3చూసినవారు
కొమ్మాల జాతర సందర్భంగా వాహనాల దారి మళ్లింపు
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం 4వ తేదీ రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్లే వాహనాలు మచ్చాపూర్, పల్లరిగూడ, మొండ్రాయి, కొత్తపల్లి, ఉప్పరపల్లి, కోనాపురం, చెన్నారావుపేట మీదుగా, నర్సంపేట నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు గిర్నిబావి, నాచనపల్లి, లక్ష్మీపురం, ఎల్కుర్తి, మచ్చాపూర్ మీదుగా ప్రయాణించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you