మున్సిపల్ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ నాలుగో వార్డు జనరల్ కు రిజర్వ్ కాగా.. ఆ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున అన్న బీరం నాగిరెడ్డి, కాంగ్రెస్ తరఫున తమ్ముడు బీరం భరత్‌రెడ్డి బరిలో నిలిచారు. అయితే ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరిలో ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠ నెలకొంది.