అదనపు కట్నం వేధింపులకు మహిళ బలి

1చూసినవారు
అదనపు కట్నం వేధింపులకు మహిళ బలి
అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త వేధిస్తుండడంతో భరించలేక భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామానికి చెందిన చల్లా అఖిల(24)కు 2022లో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ గ్రామానికి చెందిన చల్లా ప్రవీణ్ రెడ్డితో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లైన రెండు సంవత్సరాల నుంచి కట్నం కోసం అఖిలను భర్త ప్రవీణ్ రెడ్డి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మరోసారి కట్నం కోసం వేధించగా మంగళవారం ఉదయం ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్