గన్నారం గ్రామంలో ఈగల్ యూత్ ఆధ్వర్యంలో రాసాల యాదయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు రాసాల రాజు, తిరుపతి మంగళవారం మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జన్నపురెడ్డి శ్రీరామ్ రెడ్డి హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం విజయ సమ్మయ్య, తిరుమలాయపల్లి సర్పంచ్ బరిగల బాబు, మాజీ సర్పంచులు కుక్కల భాస్కర్, బెల్లి పెద్దాపురం, యూత్ సభ్యులు పాల్గొన్నారు.