రాయపర్తి మండలం, కాట్రపల్లి గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకైన మొహరం పర్వదిన పురస్కరించుకొని ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదరులకు 10, 000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ముస్లిం సోదరులందరికీ మొహరం పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు, గ్రామస్తులతో కలిసి మొహరం పండుగ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ ఆర్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.