వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

7చూసినవారు
వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను, వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో శనివారం పరిశీలించారు. గుర్తురు గ్రామ పరిధిలోని మిరపకుంట, కొమ్మనపల్లి తండా పంచాయతీరాజ్ రోడ్లు, అమ్మపురం ఆర్ అండ్ బి రోడ్లు, వెలికట్ట వడ్ల కొనుగోలు కేంద్రం పరిస్థితిని ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. దెబ్బతిన్న రోడ్ల నివేదికలను కూడా పరిశీలించారు.

ట్యాగ్స్ :