గ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలి: ఆర్ఎంపీల నిరసన

3చూసినవారు
దేవరుప్పుల మండల కేంద్రంలో ఆర్ఎంపీ మండల అధ్యక్షులు మేకపోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో 24 గంటలు వైద్యం అందిస్తున్న తమపై ఐఎంఏ దాడులు చేయడం సరికాదని, వెంటనే ఆపాలని ఆర్ఎంపీ, పీఎంపీ మండల, జిల్లా అధ్యక్షులు పసునూరి సత్యనారాయణ అన్నారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్