వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో గ్రామ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ మన్నాన్ కుమారుడు, న్యాయవాది మహమ్మద్ ఫజల్ రహమాన్ తన తండ్రి జ్ఞాపకార్థం ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ముఖ్య ప్రాంతాల్లో నిఘా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంతో పాటు, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు కెమెరాలు ఉపయోగపడతాయని గ్రామస్థులు తెలిపారు. తండ్రి జ్ఞాపకార్థం గ్రామ భద్రతకు ఉపయోగపడే కార్యక్రమం చేపట్టిన ఫజల్ రహమాన్‌ను గ్రామస్థులు అభినందించారు.