జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత, బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి, నిత్యపూజలు ప్రారంభించి, భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు.