బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీ

1451చూసినవారు
బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బైరు అరుణా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఒక ముఖ్యమైన పండుగ అని, ఈ పండుగ సందర్భంగా వారికి సంతోషాన్ని పంచడం తన బాధ్యత అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్