జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో సీపీఎం నేతలు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య మాట్లాడుతూ, గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అభ్యర్థి గెలుపు కోసం నేతలు నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు. సర్పంచ్ అభ్యర్థిగా మాచర్ల శాంతమ్మను ప్రకటించారు. ఈ సమావేశంలో గడ్డి సమ్మయ్య, మాసంపల్లి నాగయ్య, బెల్లి సంపత్, చెరుపల్లి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.