వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్ శనివారం జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని నేరాలు, కేసులకు సంబంధించిన వివిధ రిజిస్టర్లు, రికార్డులను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.