దేవరుప్పుల: అభివృద్ధి పనులకు శ్రీకారం: ఎమ్మెల్యే

59చూసినవారు
దేవరుప్పుల: అభివృద్ధి పనులకు శ్రీకారం: ఎమ్మెల్యే
పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలోని కొలుకొండ, అప్పిరెడ్డిపల్లి, చౌడూరు గ్రామాలలో సిఆర్ఆర్ నిధుల ద్వారా మంజూరైన రూ. 35 లక్షల సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనుల ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. కొలుకొండ రూ. 12 లక్షలు, అప్పిరెడ్డిపల్లి రూ. 8 లక్షలు, చౌడూరు గ్రామాలకు రూ. 15 లక్షలు, మొత్తం 35 లక్షలు మంజూరు చేశారు.

సంబంధిత పోస్ట్