నేల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన

4చూసినవారు
నేల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన
నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని రాయపర్తి సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి రైతులకు సూచించారు. ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా రాయపర్తి గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ యాసంగిలో తక్కువ నీరు అవసరమయ్యే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం, విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారి గీత, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్