జనగామ జిల్లా పాలకుర్తిలో రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంటాలు పెట్టక, లారీలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.