జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామంలోని నరసయ్య అనే రైతుకు చెందిన గడ్డివాము, పశువుల పాక గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో పాకలో పశువులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.