
భూమి అమ్మి భార్యను చదివించిన భర్త.. ఉద్యోగం రాగానే ప్రియుడితో జంప్!
బీహార్‌లోని హాజీపూర్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భర్త అమన్ కుమార్ తన భార్య గుంజన్ కుమారి చదువు కోసం ఆస్తులు అమ్మి మరీ చదివించాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె తన 10 ఏళ్ల కుమారుడిని, భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ నెల 23న ప్రియుడితో కలిసి ఉండగా భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని.. పోలీసులకు ఫిర్యాదు చేయగా మహిళతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారని తెలిపారు. అయితే తాను భర్తతో ఉండలేనని, ప్రియుడితోనే ఉంటానని ఆమె చెబుతోందని పోలీసులు వెల్లడించారు.




