వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహబూబ్నగర్ గ్రామంలోని వివిధ వినాయక మండపాలను గ్రామ
కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెండ్లి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి చందాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెన్నబోయిన రవి, సీనియర్ నాయకులు ఇల్లందల భగవాన్, ఎస్. డి. మైనుద్దీన్తో పాటు గ్రామ
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.