దేశంలో బీజేపీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జులై 9న జరుగుతున్న కార్మికుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని దుండి వీరన్న పిలుపునిచ్చారు. శుక్రవారం తొర్రూరు మండల కేంద్రంలో సీఐటీయు ఆఫీసులో తొర్రూరు, పెద్ద వంగర మండలల కమిటీ సమావేశం రాపోలు వీరన్న, జమ్ముల శ్రీనుల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి దుండి వీరన్నపాల్గొని మాట్లాడారు.