99 రోజుల ప్రణాళికపై రామన్నగూడెం గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన సమావేశం

299చూసినవారు
99 రోజుల ప్రణాళికపై రామన్నగూడెం గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన సమావేశం
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామంలో 99 రోజుల ప్రణాళికపై సర్పంచ్ బండి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పింఛన్లు, రైతు రుణమాఫీ, కొత్త కరెంట్ లైన్ల వంటి సంక్షేమ పథకాలపై వివరించారు. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్, సెక్రటరీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్, వెలుగు సీఏ, కరెంట్ శాఖ అధికారులు, హౌసింగ్ ఏఈ, పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్