కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

274చూసినవారు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాతోత్ రాంచందర్ నాయక్ మంగళవారం పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం తగ్గించడానికే ఈ పథకం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సకాలంలో చెక్కులు అందడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.