పాలకుర్తి: దోపిడీ లేని సోషలిస్టు వ్యవస్థ రావాలి

63చూసినవారు
పాలకుర్తి: దోపిడీ లేని సోషలిస్టు వ్యవస్థ రావాలి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో సీపీఎం నేతలు శనివారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మాట్లాడుతూ మే 22, 23వ తేదీలలో గ్రామంలో రెండు రోజులపాటు జరగబోయే రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలనే పిలుపునిచ్చారు. సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. దేశంలో దోపిడి లేని సోషలిస్టు వ్యవస్థ రావాలన్నారు కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.