జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మైదాకు కుంట, శంకరదేవి కుంట, కోనమ్మకుంట, ఎర్రమల్లయ్య కుంటల భూములను కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కుంట కట్టలను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.