ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తికి చెందిన ఆమని–మహేందర్ దంపతుల కుమార్తె పంజాల హాసిని, కూచిపూడి, జానపద నృత్యాల్లో తన ప్రతిభతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధిస్తోంది. గత ఐదేళ్లుగా శిక్షణ పొందుతున్న హాసిని 300కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి జానపద నృత్య పోటీల్లో ప్రథమ బహుమతి, విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జూనియర్ విభాగంలో ద్వితీయ బహుమతి పొందింది. వరంగల్‌కు చెందిన ఎన్సీఎన్ కళాక్షేత్రం గురువు వెంకటేశ్వర్లు వద్ద శిక్షణ పొందుతున్న హాసిని నృత్య ప్రదర్శనలతో పలువురి ప్రశంసలు అందుకుంటోంది.