పాలకుర్తి: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: ఎర్రబెల్లి

2చూసినవారు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా భాషకు శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని వారు కోరారు.

ట్యాగ్స్ :