పాలకుర్తి: రహదారి ఇలా.. బడికి పోయేదెలా!

5చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు (జే) ఉన్నత పాఠశాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ప్రస్తుతం మట్టి రోడ్డు చెరువు కట్ట మీదుగా ఉండటంతో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అనుకోని సంఘటనలు, ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నూతన రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్