జనగామ జిల్లా పాలకుర్తి బస్టాండ్ సమీపంలో గత నెల 27న ధర్మారావుపై మారణాయుధాలతో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధర్మారావు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో 15 లక్షల సుఫారీ ఇచ్చి హత్య చేయించడానికి ఒప్పందం కుదిరినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు హాజరుపరిచారు. కేసు వివరాలను వర్ధన్నపేట ఏసీపీ నరసయ్య, సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్ఐ పవన్ కుమార్ వెల్లడించారు.