జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ లో గురువారం జరుగుతున్న సమగ్ర సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. జిల్లాలో ఇప్పటికే సర్వే చివరి దశలో ఉందని తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు చాలా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎలాంటి సందేహం ఉన్న అధికారులను అడిగి తెలుసుకుని నమోదు చేయాలని తెలిపారు.