జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు నల్ల బ్యాడ్జీలు, ప్ల కార్డులతో నిరసన చేపట్టారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల సోమన్న డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ల వల్ల ఉద్యోగ భద్రత తగ్గుతోందని, కార్మిక హక్కులు దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.