జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఇటీవల టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియామకమైన సందర్భంగా గురువారం టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ఈ నియామకం తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నారు.