మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన హోమియో వైద్య శిబిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ పాల్గొన్నారు. దుష్ఫలితాలు లేని హోమియో మందులను ప్రజలు ఆదరించి, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ శిబిరాన్ని 200 మందికి పైగా ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.