పోలీసు అమరవీరుల దినోత్సవం: విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు

1293చూసినవారు
పోలీసు అమరవీరుల దినోత్సవం: విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు
పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగాం జిల్లా పాలకుర్తి మండల పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. సుధా హైస్కూల్ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో, సిఐ జానకిరామ్ రెడ్డి, ఎస్సైలు పవన్ కుమార్, లింగారెడ్డి, యాకూబ్ హుస్సేన్ విద్యార్థులకు పోలీసు విధివిధానాలు, వైర్లెస్ కమ్యూనికేషన్, సైబర్ క్రైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్, షీ టీమ్, డయల్ 100, డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ రూల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్