మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామ శివారు మామిడి తోటలో మంగళవారం కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో నిర్వాహకులు నలుగురిని అరెస్ట్ చేసి, 17 పందెం కోళ్లు, 65 వేల నగదు, 3 బైకులు, 4 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.