రేపు తొర్రూరు టౌన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
తొర్రూరు విద్యుత్ సబ్స్టేషన్ నందు విద్యుత్ సరఫరాలను మెరుగుపరిచేందుకు 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను 8MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ గా కెపాసిటీ పెంచే విషయంలో ఆదివారం ఉదయం (రేపు) 7 గంటలనుండి సాయంత్రం 6 గంటలవరకు తొర్రూరు పట్టణం, చింతలపల్లి, పాలకేంద్రం, సోమ్లా తండా, దుబ్బతండ, కొమ్మనపల్లి తండ తదితర ప్రాంతాల వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని తొర్రూరు డివిజన్ ఇంజనీర్ ఎన్ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ఏరియాలలో విద్యుత్ వినియోగదారులు సహకరించవల్సిందిగా కోరారు.