మక్కలు కొనుగోలు చేయాలని పాలకుర్తిలో ధర్నా

1చూసినవారు
మక్కలు కొనుగోలు చేయాలని పాలకుర్తిలో ధర్నా
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో గురువారం మక్కల కొనుగోలుపై ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. వెంటనే మక్కల కొనుగోలు ప్రక్రియ చేపట్టి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్