ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రం మీదుగా వెళ్లే వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారింది. ప్రధాన రహదారి అయినప్పటికీ, అధికారులు చెత్త తొలగింపుపై దృష్టి సారించకపోవడంతో మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల దుర్వాసన, దోమలు, ఈగల బెడద పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి రహదారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.