జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ చేతుల మీదుగా రివార్డు..
జిల్లాలోని పోలీసు అధికారులు అప్రమత్తతతో మరింత ఉత్సాహభరితంగా విధులు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ప్రమోషన్లు సాధించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆకాంక్షించారు. సైబర్ క్రైమ్ నేరస్తులను అరెస్టు చేసిన సందర్భంగా కేసముద్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్యనారాయణ కు రీ వార్డును అందజేసి మాట్లాడుతూ కేసముద్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్రమత్తంగా విధులు నిర్వహించి సైబర్ క్రైమ్ నేరస్తులను అరెస్టు చేయడం అభినందనీయమన్నారు. ఇలాగే జిల్లాలోని పోలీసు అధికారులందరూ ఉత్సాహభరితంగా విధులు నిర్వహిస్తూ స్టేషన్ దాకా వచ్చిన ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.