శివరామపురం పాఠశాలలో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సర్పంచ్

3చూసినవారు
శివరామపురం పాఠశాలలో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సర్పంచ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకాన్ని శివరామపురం ఎంపీపీఎస్ పాఠశాలలో సర్పంచ్ షీల హేమలత రత్నాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బండ రాంరెడ్డి, ఉపాధ్యాయులు ప్రేమ్ చందర్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్