జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ సందర్శించారు. ఆయన పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్, బాలికలకు అందించే ఆహార మెనూను పరిశీలించారు. విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి, వారితో ముచ్చటించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రిన్సిపల్ సుకన్యతో ఆరా తీశారు.